స్ఫూర్తిదాయక జోడి: తమ ఇంటి ముందు తోటను ఆహార భద్రతా కేంద్రంగా మార్చిన దంపతులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Corvallis

అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రానికి చెందిన జీన్ మేరీ, కోరీ బక్టన్ దంపతులు తమ ఇంటి ముందున్న విశాలమైన గడ్డి భూమిని సేంద్రియ కూరగాయల సాగు భూమిగా మార్చారు. ది ఫార్మెట్ ప్రాజెక్ట్ పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు పది టన్నుల తాజా కూరగాయలను నిరుపేదలకు, ఆహార బ్యాంకులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సామాజిక స్పూర్తితో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నామని వారు వెల్లడించారు.