పాలకొండలో టీడీపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నేతల సుడిగాలి ప్రచారం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని గుమ్మడి దమయంతి తరఫున నేతలు విస్తృతంగా తిరిగారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీడీపీ ఇంచార్జ్ పడాల భూదేవి మరియు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఓటర్లను కోరారు. పట్టణ అధ్యక్షుడిగా ఉన్న గుమ్మడి సింహాద్రి సతీమణి అయిన దమయంతిని గెలిపిస్తే అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రచారంలో నేతలు స్పష్టం చేశారు.