అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న చకోర సినిమా

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

శ్రవణ్ మరియు మలైకా టి వాసుపల్ జంటగా నటించిన చకోర సినిమా అక్టోబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు మంగా శ్రీనివాస్ తెలిపారు. శనివారం నాడు యువ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయని, తెలుగు తెరపై ఇప్పటివరకు రాని సరికొత్త ప్రేమకథ ఇదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.