సింగర్ దిల్జీత్ దోసాంజ్ వివాదానికి తెరదించిన కాక్రోచ్ జనతా పార్టీ నేత
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
పంజాబీ స్టార్ సింగర్ దిల్జీత్ దోసాంజ్ తో కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దిల్జీత్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని, ఆయనకు తాను వీరాభిమానినని దిప్కే స్పష్టం చేశారు. చిన్న తమ్ముడిగా భావించి ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని ఆయన కోరినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.