లవ్ అండ్ వార్ చిత్రంలో రణ్బీర్ అలియా ఫస్ట్ లుక్స్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లను అధికారికంగా విడుదల చేసింది. రణ్బీర్, అలియా కొత్త లుక్స్లో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.