టచ్ చేస్తే జీవితాంతం బాధపడతారంటూ డీఎంకేపై టీవీకే చీఫ్ విజయ్ హెచ్చరిక
రిపోర్టర్: శివ
స్థలం: చెన్నై
తనను టచ్ చేస్తే జీవితాంతం బాధపడతారంటూ డీఎంకేను ఉద్దేశించి టీవీకే అధ్యక్షుడు విజయ్ హెచ్చరించారు. మధురాంతకం ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, మహిళలను కించపరిచేలా డీఎంకే నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్నాడీఎంకే నేడు డీఎంకేకు శాఖగా మారిందని విమర్శించారు. స్టాలిన్ కుటుంబమే రాష్ట్రానికి యజమానిలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అవినీతిపై నిలదీస్తూ, చిన్నారులపై అఘాయిత్యాల ఘటనలో సీఎం స్టాలిన్ మౌనం వీడాలని విజయ్ డిమాండ్ చేశారు.