సీబీఎస్ఈ ఆరో తరగతి త్రిభాషా సూత్రం అమలు ఏడాది వాయిదా వేయాలని సుప్రీంకోర్టు సూచన

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

సీబీఎస్ఈ ఆరో తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం అమలును ఏడాది పాటు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు గురువారం సలహా ఇచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుగుణంగా ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, విద్యార్థులు, పాఠశాలలకు తగిన సమయం ఇచ్చేందుకు ఈ సూచన చేసినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బోర్డు దీనిపై పరిశీలించి కొత్త అఫిడవిట్ దాఖలు చేయనుంది.