అఫ్గానిస్థాన్‌పై తొలి టీ20లో భారత్ ఘనవిజయం

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

దిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శర్మ అద్భుత అర్ధశతకంతో మెరిశాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.