కాంగ్రెస్ లో వర్గపోరు: రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి ఫైర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి ఆరోపించారు. రామ్ లీలా మైదాన్ సభలో ప్రియాంక గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాహుల్ గాంధీ శిబిరం ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం రెండు అధికార కేంద్రాలుగా విడిపోయిందని, ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని ప్రదీప్ భండారి ఘాటుగా స్పష్టం చేశారు.