అయినవిల్లి విఘ్నేశ్వర సన్నిధిలో అలరించిన సాంస్కృతిక వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐనవిల్లి

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం కూచిపూడి నృత్య ప్రదర్శన కన్నులపండువగా జరిగింది. స్వామివారి సన్నిధిలో కళాకారులు అభినయించిన సాంప్రదాయ నృత్య రూపకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.