తుపాను నష్టంపై కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు కీలక భేటీ

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

అర్నబ్ తుపాను కారణంగా ఏపీలో తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్రం నుంచి సత్వర సాయమందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బృందాన్ని కోరారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో బృందంతో సమావేశమైన ఆయన, ప్రాథమిక అంచనా ప్రకారం రూ.4,526 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నామని పేర్కొంటూ, త్వరితగతిన సిఫార్సులు సమర్పించాలని సీఎం కోరారు.