వ్యవసాయ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ సీపీఎం డిమాండ్
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు మరియు వ్యవసాయ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని సీపీఎం డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి లక్ష కోట్ల రూపాయలు రాబట్టి రైతులు మరియు కౌలురైతులను ఆదుకోవాలని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. పర్యటనల్లో తాము పరిశీలించిన వివరాలను గురువారం విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.