యాదాద్రి క్షేత్రంలో వైభవంగా కార్తీకోత్సవం: పోస్టర్ను ఆవిష్కరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రిపోర్టర్: వెంకట్ స్థలం: నల్గొండ

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య క్షేత్రంలో ఈ నెల 20 నుండి 22 వరకు కొండపైన ఉత్తర మాడ వీధిలో అత్యంత వైభవంగా జరగనున్న కార్తీకోత్సవానికి సంబంధించిన పోస్టర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ తదితరులు పాల్గొన్నట్లు వెల్లడించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.