యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట విషాదం కాదు: అంజనా అర్జున్ వివాహం
రిపోర్టర్: అశోక్
స్థలం: చెన్నై
ప్రముఖ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ చిన్న కుమార్తె అంజనా అర్జున్ వివాహం విదేశాల్లో ఘనంగా జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలోనే ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ఆమె, తాజాగా అక్టోబర్ 19న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంజనా వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొని నూతన దంపతులను ఘనంగా ఆశీర్వదించినట్లు సమాచారం.