మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నల్గొండ

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-1,3,5 రెగ్యులర్ మరియు బ్యాక్ లాగ్ విద్యార్థులకు ఈ నెల 18 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గ్రూప్-ఏ కాలేజీలకు 18, 19, 20 తేదీలలో, గ్రూప్-బి కాలేజీలకు 21, 22, 23 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.