అల్-ఖైదా కొత్త వీడియోలో హమ్జా బిన్ లాడెన్ దృశ్యాలు!

రిపోర్టర్: సతీష్ స్థలం: World

సెప్టెంబర్ 11 దాడుల 25వ వార్షికోత్సవం సందర్భంగా అల్-ఖైదా విడుదల చేసిన ప్రచార వీడియోలో ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ తొలిసారిగా కనిపించాడు. 2019లో జరిగిన అమెరికా సైనిక చర్యలో హమ్జా మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఈ తాజా 50 నిమిషాల వీడియో నిఘా వర్గాలను విస్మయానికి గురిచేసింది. రిక్రూట్‌మెంట్ల కోసం బిన్ లాడెన్ పేరును ఉగ్రవాద సంస్థ మళ్లీ తెరపైకి తెచ్చింది.