పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి.. దస్తూరాబాద్ ఎస్సై సాయికుమార్ పిలుపు!

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దస్తూరాబాద్

నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం మున్యాల్ గ్రామంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో ఎస్సై సాయికుమార్, స్థానిక సర్పంచ్ కట్కూరి లలితా రాజేష్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల్లో నాటిన మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె.రచన, మాజీ ఎంపీటీసీ స్వామి, ఉపసర్పంచ్ లావణ్య మొగిలి, ప్రవీణ్, సత్యగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.