కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన గౌతమ్ గంభీర్
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దేశ రాజధానిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో భాగంగా అమిత్ షాకు గణేష్ విగ్రహాన్ని గంభీర్ బహుకరించారు. తనకు విలువైన సమయం కేటాయించినందుకు అమిత్ షాకు ఆయన సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.