కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలన్న సోనమ్ వాంగుక్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: లద్దాఖ్

లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా మరియు ఆరవ షెడ్యూల్ రక్షణలు కల్పించాలని కోరుతూ జరిగిన నిరసనల్లో నలుగురు పౌరులు మృతి చెందిన ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగుక్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లద్దాఖ్ అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనను ఎన్‌కౌంటర్ చేసినా లద్దాఖ్ ప్రజల హక్కుల పోరాటం ఆగదని సోనమ్ వాంగుక్ స్పష్టం చేశారు.