వేమూరులో సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందజేత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమృతలూరు
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 83 మంది బాధితులకు నలభై లక్షల అరవై ఆరు వేల ఇరవై ఐదు రూపాయల ఆర్థిక సాయం మంజూరైంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన లబ్ధిదారుల వైద్య బిల్లులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సిఫార్సు చేయగా, ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసింది. గురువారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా చెక్కులను పంపిణీ చేసి, వారికి భరోసా కల్పించారు.