వైకాపాకు భారీ షాక్ ఇస్తూ తెదేపాలోకి బొత్స బంధువు చిన్నశ్రీను

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయనగరం

శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో వైకాపాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బొత్స బంధువు, మాజీ జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు మెరకముడిదాం మండలంలోని పదమూడు గ్రామాల కీలక నేతలు వైకాపాకు మూకుమ్మడిగా రాజీనామా చేసి తెదేపాలో చేరనున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.