దివ్యాంగ విద్యార్థుల ఉత్సాహభరిత విజ్ఞాన విహార యాత్ర

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంతో పాటు వివిధ ప్రాంతాల భవిత కేంద్రాలలోని దివ్యాంగ విద్యార్థులు రామోజీ ఫిలిం సిటీకి విజ్ఞాన విహార యాత్రకు బయలుదేరారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పీఎం శ్రీ పథకం నిధులతో ఈ యాత్రను ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి ఆధ్వర్యంలో విద్యార్థులు తరలివెళ్లారు. ఈ యాత్రకు బీర్ల ఫౌండేషన్ తరపున చైర్మన్ అనితా ఐలయ్య ప్రత్యేకంగా టీషర్టులు అందజేసి విద్యార్థులను అభినందించారు.