భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ సమీక్ష
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి బుధవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రిజర్వాయర్లు మరియు కాజ్వేల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.