రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి ట్రంప్ ప్రత్యేక దౌత్య బృందం

రిపోర్టర్: రాము స్థలం: World

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లను ప్రత్యేక ప్రతినిధులుగా నియమించి ఇరు దేశాలకు పంపుతున్నారు. నెలకు 25 వేల మంది సైనికులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ట్రంప్, తక్షణమే యుద్ధం ఆపాలని డిమాండ్ చేశారు. పుతిన్, జెలెన్‌స్కీల మధ్య వ్యక్తిగత విభేదాలే శాంతికి అడ్డంకిగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.