దేశంలో తొలిసారిగా జిల్లా స్థాయి లేబర్ మార్కెట్ నివేదిక విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంకాల కార్యాలయం దేశంలో తొలిసారిగా జిల్లా స్థాయి కీలక లేబర్ మార్కెట్ గణాంకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 57.8 శాతం జిల్లాల్లో మహిళా లేబర్ ఫోర్స్ భాగస్వామ్య రేటు 40 శాతానికి పైగా నమోదైనట్లు ఈ నివేదిక వెల్లడించింది. గుజరాత్‌లోని సూరత్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా, బీహార్‌లోని దర్భంగా జిల్లా చివరి స్థానంలో నిలిచింది.