బాలీవుడ్ లో ప్రాంతీయ వివక్ష ఎదురవుతోందంటూ నటి రెజీనా తీవ్ర ఆవేదన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ముంబై
బాలీవుడ్ చిత్రాల్ లో దక్షిణాది కథానాయికలపై ప్రాంతీయ వివక్ష తీవ్రంగా చూపుతున్నారని ప్రముఖ నటి రెజీనా కాసాండ్రా ఆవేదన వ్యక్తం చేశారు. కేసరి-2 చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన నటించినప్పటికీ ప్రమోషన్లలో తన పేరును ప్రస్తావించలేదని తెలిపారు. సోషల్ మీడియాలో కనీసం ట్యాగ్ కూడా చేయకుండా దారుణంగా వ్యవహరించారని, ఉత్తరాదిలో తనను సౌత్ ఇండియన్గానే చూస్తూ తగిన గుర్తింపు ఇవ్వడం లేదని రెజీనా వాపోయారు.