గ్లోబల్ ఆడియన్స్ కోసం రామాయణ సినిమాలో ప్రత్యేక ఎడిట్స్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ముంబై

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలతో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ సినిమాను గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ల కోసం వేర్వేరు ఎడిట్స్‌తో సిద్ధం చేస్తున్నారు. విదేశీ ప్రేక్షకుల కోసం రూపొందించే ఇంగ్లీష్ వెర్షన్ హిందీ కట్ కంటే సుమారు 30 నిమిషాలు తక్కువగా ఉండనుండగా, పాటలను పూర్తిగా తొలగించి కాంపాక్ట్ నేరేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తొలి భాగం 2026 నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.