బొబ్బిలిలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు.. ఆహ్వానం పలికిన బ్రహ్మకుమారీస్
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బ్రహ్మకుమారీస్ ప్రజాపిత విశ్వవిద్యాలయం సిద్ధమైంది. సెప్టెంబర్ 6, ఆదివారం ఉదయం 8 గంటలకు కొత్త జగన్నాధపురం టీచర్స్ కాలనీలోని మెడిటేషన్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ వేడుకలకు ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు ఇంచార్జ్ రాజేశ్వరి తెలిపారు. హాజరయ్యేవారు 82473-83954 నంబర్‌కు కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.