స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి సర్కార్ కసరత్తు

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయవాడ

స్వర్ణ గ్రామ మరియు వార్డు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నారాయణ తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు, కారుణ్య నియామకాలపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్తో పాటు జీవో 244ను జారీ చేసి నాలుగు కేటగిరీల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు సర్కార్ సిద్ధంగా ఉంది.