ఏపీకి మెగా రైల్వే ప్రాజెక్టు, చంద్రబాబు హర్షం
రిపోర్టర్: గోపి
స్థలం: ఆంధ్రప్రదేశ్
దక్షిణాదిలో రైళ్ల రద్దీకి చెక్ పెట్టేందుకు కేంద్ర కేబినెట్ రూ.10,021 కోట్లతో 5 మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ.1,157 కోట్లతో ఏపీలో రేణిగుంట-అరక్కోణం మార్గంలో 3, 4వ లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.