అనంతపురంలో కుండపోత వర్షం జలపాతాలను తలపిస్తున్న శింగనమల
రిపోర్టర్: వెంకట్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లాలోని కరువు ప్రాంతమైన శింగనమల నియోజకవర్గంలో అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. కొండ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో నిదనవాడ, పెద్దమల్లుగొంది, చిన్నమట్లగొంది, నాగులగుడ్డం తండా తదితర గ్రామాలు నీటి దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కరువు నేలలో ఏర్పడిన ఈ అద్భుతమైన జలపాత దృశ్యాలను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపగా, అధికారులు తగిన చర్యలు చేపట్టారు.