పౌల్ట్రీ రంగానికి పూర్తి అండగా ఉంటాం: మంత్రి అచ్చెన్నాయుడు

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయవాడ

రాష్ట్రంలో పౌల్ట్రీ రంగానికి ప్రధాన సమస్యగా మారిన మొక్కజొన్న ధరల నియంత్రణకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రంతో చర్చించి నూక బియ్యాన్ని పౌల్ట్రీ ఫారాలకు అందుబాటులోకి తెస్తామన్నారు. పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేసేందుకు మూడేళ్లకు రూ.657 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో నూతన విధానం తెచ్చామని పేర్కొన్నారు. వైకాపా హయాంలో ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వంలో నేరుగా రైతులకు సాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు.