దోమ మండలం: దారి తెలియక జంక్షన్ వద్ద ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: దోమ
మోత్కూర్ నుంచి పాలేపల్లి వెళ్లే ప్రధాన రహదారిలోని జంక్షన్ వద్ద వివిధ గ్రామాలకు వెళ్లే మార్గాలను సూచించే బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఏ మార్గం ఏ గ్రామానికి వెళ్తుందో తెలియక కొత్తగా వచ్చే వాహనదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి జంక్షన్ వద్ద అన్ని గ్రామాల పేర్లతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.