దివ్యాంగులకు శుభవార్త.. ఉచిత సహాయక పరికరాల కోసం దరఖాస్తులు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పాడేరు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దివ్యాంగులకు వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) కీలక సూచన చేసింది. అర్హత కలిగిన వారు వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, ల్యాప్టాప్లు వంటి సహాయక పరికరాల కోసం ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఉన్న దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కృత్రిమ అవయవాలు, బ్రెయిల్ పుస్తకాలు, టచ్ ఫోన్ల వంటి పరికరాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.