బీఆర్ఎస్ భూభాగోతాలు బట్టబయలు: మియాపూర్ కుట్రలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధ్వజం
రిపోర్టర్: నరేష్
స్థలం: ఖమ్మం
గతంలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములను కాజేయడానికే దగాకోరు ధరణి పోర్టల్‌ను తెచ్చారని, సుప్రీంకోర్టు తీర్పుతో మియాపూర్ భూముల వెనక జరిగిన కుట్రలు బట్టబయలయ్యాయని పొంగులేటి శ్రీనివాస రెడ్డి - మంత్రి, పాలేరు ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఐదు వందల అరవై ఎకరాల భూమిని కాజేసేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర పన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.