మహారాష్ట్రలో దారుణం: భార్య నలుగురు పిల్లలను గెంటేసి రోడ్డుపై భిక్షాటన
రిపోర్టర్: సతీష్
స్థలం: Thane
మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్ ఈస్ట్ ప్రాంతంలో పదహారేళ్ల కాపురం తర్వాత భర్త ముస్తఫా తన భార్య రుక్సార్ను, నలుగురు పిల్లలను ఇంటి నుంచి గెంటేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి హక్కుల కోసం వెళితే అత్తమామలు దారుణంగా కొట్టారని ఆమె వాపోయారు. ఎటువంటి ఆధారం లేక రోడ్డుపై పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై కొల్షేవడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.