దుర్గా పూజ వేళ పశ్చిమ బెంగాల్‌లో కఠిన నిబంధనలు జారీ!
రిపోర్టర్: కిరణ్
స్థలం: పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజ వేళ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. మహా అష్టమి రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. నిమజ్జన ఊరేగింపుల్లో డీజే మ్యూజిక్‌ను నిషేధించడంతో పాటు, రోడ్లు మరియు జాతీయ రహదారులను బ్లాక్ చేయరాదని స్పష్టం చేసింది. అలాగే ఈ ఏడాది రెడ్ రోడ్ దుర్గా పూజ కార్నివాల్ రద్దు చేయబడింది.