మణుగూరులో దుకాణాల దోపిడీపై అధికారుల తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మణుగూరు, తెలంగాణ

మణుగూరులో కిరాణా, ఎలక్ట్రికల్ దుకాణాల్లో అధిక ధరలు, నాణ్యత లేని వస్తువుల విక్రయాలతో వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించే షాపులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.