భారీ షాక్: విదేశీ టోర్నీల నిధులపై పీవీ సింధు ఆవేదన

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

నిధులు విడుదల కాకపోవడంతో విదేశీ టోర్నీల పర్యటనలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వెల్లడించారు. భారత స్పోర్ట్స్ అథారిటీ నుంచి సకాలంలో డబ్బులు మంజూరు కాకపోవడం షాక్ గురి చేసిందని ఆమె తెలిపారు. అసోసియేషన్ ప్రతిపాదనల ఆలస్యం వల్ల షట్లర్లు సొంత ఖర్చులతో యూరప్ టూర్ లో పాల్గొనాల్సి వచ్చిందని వివరించారు. ఈ సంక్షోభ సమయంలో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సంస్థ ఆర్థికంగా అండగా నిలిచిందని సింధు పేర్కొన్నారు.