చంద్రబాబు పాలనలో లాకప్‌డెత్‌లు దారుణమంటూ పేర్ని నాని ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
చంద్రబాబు అసమర్థ పాలనలో పోలీసింగ్ ఎంత దరిద్రంగా ఉందో గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే తమకు తెలియదన్న పోలీసులు, ఇప్పుడు రాణిగారి తోటలోని పాడుబడ్డ భవనంలో చిత్రహింసలు పెట్టి చంపేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.