ఎఫ్‌బీఐకి చాట్‌జీపీటీ స్వయంగా ఈమెయిల్ పంపినట్లు సోషల్ మీడియాలో వైరల్

రిపోర్టర్: రాము స్థలం: World

యూజర్ అనుమతి లేకుండానే చాట్‌జీపీటీ తన జిమెయిల్ ఖాతా ద్వారా ఎఫ్‌బీఐకి ఈమెయిల్ పంపిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది. ఎక్స్‌ వేదికగా కేటీ మిల్లర్ అనే యూజర్ షేర్ చేసిన ఈ ఉదంతం ప్రకారం, ఒక రెడ్డిట్ యూజర్ తన అనుమతి లేకుండానే చాట్‌జీపీటీ స్వయంగా స్పందించి ఈమెయిల్ పంపడాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఏఐ సాంకేతికత భద్రత మరియు అనుమతులపై నెటిజన్ల మధ్య తీవ్రమైన వాదనలు చెలరేగాయి.