రణబాలి షూటింగ్ పూర్తి చేసుకున్న రష్మిక మందన్న

రిపోర్టర్: గోపి స్థలం: India

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'రణబాలి'. ఈ సినిమాలో జయమ్మ పాత్రలో నటిస్తున్న రశ్మిక మందన్న తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. సెట్ లో చిత్రబృందం ఆమెకు ఎమోషనల్ గా వీడ్కోలు పలికింది. 1854-1878 బ్రిటీష్ కాలం నాటి చారిత్రక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.