టెన్షన్ కలకలం: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో సంచలనం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Mumbai

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనలో ముంబై క్రైమ్ బ్రాంచ్ సంచలన విషయాలు వెల్లడించింది. దుండగులు తొలుత వేరే ప్రముఖ సెలబ్రిటీని లక్ష్యంగా చేసుకున్నారని, అయితే కట్టుదిట్టమైన భద్రత కారణంగా సాధ్యం కాకపోవడంతో టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా మారారని అధికారులు తెలిపారు. రాజస్థాన్లోని కోటాలో పట్టుబడిన ముగ్గురు నిందితులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.