పాకిస్థాన్ మంత్రి నుంచి ట్రోఫీ తీసుకునేందుకు భారత మహిళల క్రికెట్ జట్టు నిరాకరణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
ఆసియాకప్ టీ20 టోర్నీలో శ్రీలంకను ఓడించి ఎనిమిదోసారి ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టు, ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకుల చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. గత ఏడాది పురుషుల జట్టు తీసుకున్న నిర్ణయానికి మహిళల జట్టు సంఘీభావం తెలిపిందని వెల్లడించింది.