ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం భారీ వర్షాల హెచ్చరిక
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Visakhapatnam
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోందని, విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.