పిఠాపురం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 'పాడా' ఏర్పాటు!
రిపోర్టర్: సురేష్
స్థలం: కాకినాడ
పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీని ప్రణాళిక శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ప్రభుత్వం ప్రకటించింది. కాకినాడ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ ప్రత్యేక సంస్థ కొనసాగుతుంది. నియోజకవర్గంలో సమగ్ర ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా మూడు మండలాలు, రెండు పురపాలక సంఘాలతో ఈ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.