రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం: నివారణ మార్గాలు వివరించిన డాక్టర్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

శరీరంలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ రేవంత్ బొడ్డు వెల్లడించారు. కాళ్లలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే డీప్ వీన్ థ్రాంబోసిస్ సమస్యను వివరిస్తూ, కదలికలు లేకపోవడం, సుదీర్ఘ ప్రయాణాలు, జన్యుపరమైన కారణాల వల్ల ఈ ముప్పు పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి గంటకు నడవడం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలతో ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపారు.