బుచ్చిరెడ్డిపాళెంలో రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి
రిపోర్టర్: సునీల్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలోని ముంబయి జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. చెల్లాయపాలేనికి చెందిన వీరేంద్ర, దినేష్ కుమార్, సంతోష్ ద్విచక్రవాహనంపై వస్తుండగా సీఎస్ఆర్ వైన్స్ వద్ద ఆటోను ఢీకొన్నారు. ఈ ఘటనలో వీరేంద్ర, దినేష్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన సంతోష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.