విద్యార్థులకు అలర్ట్: మహారాష్ట్ర పదవ తరగతి పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: Maharashtra
మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ను త్వరలో విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా పరీక్షల తేదీలను పరిశీలించుకోవాలని సూచించారు. టెన్త్ పరీక్షలు ఫిబ్రవరి పదిహేను నుండి మార్చి పదకొండు వరకు, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి ఎనిమిది నుండి మార్చి పదహారు వరకు జరగనున్నట్లు బోర్డు అధికారులు స్పష్టం చేశారు.