హైదరాబాద్‌లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం శరవేగంగా.
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. ఘట్‌కేసర్-కాజీపేట మార్గంలో 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మల్టీ-ట్రాకింగ్ పనుల ద్వారా రైళ్ల నిరీక్షణ సమయం తగ్గి, సగటు వేగం గంటకు 80 కిలోమీటర్లకు పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.